
పయనించే సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి
మాఘమాసం మొదటి ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు లో మెట్టమీద శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం నందు కోనసీమ జిల్లా ఆలమూరు కి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక సత్కార పండితుడు ప్రతిష్టాచార్య సూర్యోపాసకులు అయిన బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరి పండు శివాచార్య మరియు వారి సహచర బృందం తో ప్రత్యేక పూజలు నిర్వర్తించిన మహారాజశ్రీ వెలగల అప్పారెడ్డి గారి దంపతులు… ఈ సందర్భంగా స్వామివారిని వేలాదిమంది దర్శించారు… ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి సేవా సమితి వారు, పోలీస్ శాఖ వారు ఇంచుమించు 70 మంది పోలీస్ శాఖ వారు మరియు అలాగే మరో భక్తులు గంటా సురేష్ గారు మరియు వారి మిత్రబృందం కలిసి సుమారు13వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్ర నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి శ్రీ సూర్య భగవానుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు…
