ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 12
కూనవరం మండలం కోతులగుట్ట లోని ఆదివాసి అమరవీరుడైన కొమరం భీమ్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడానికి ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. దుండగుల ప్రతాపం అమరవీరుల విగ్రహాలపై కాదని ధైర్యం ఉంటే ముఖాముఖిగా ఆదివాసిలతో తలపడాలని ఆయన సవాల్ విసిరారు. ఈ విషయంపై గౌరవ పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి దుండగులను పట్టుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమరవీరుల విగ్రహాలపై దాడి చేసి ఆదివాసీలను భయపెట్టలేరని ఆదివాసి పోరాటాలను ఆపలేరని, ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు ఆదివాసులు భయపడరని హెచ్చరించారు. అయితే కొమరం భీం విగ్రహాన్ని ధ్వంసం చేయటం అంటే ఆదివాసుల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అని ఆదివాసులపై దాడి చేయడమే అని దీన్ని ఆదివాసిల, ఆదివాసి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని ప్రభుత్వం మరియు అధికారులు దీనిపై స్పందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. దుండగులకు బహుశా కొమరం భీమ్ చరిత్ర తెలియదు అనుకుంటా ఆయన వీరోచిత పోరాట పటిమ ఆయన ఆశయ సాధనాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని ఒక్కసారి కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమంలోకి దిగామంటే ఇకపై ఏజెన్సీలోని ఆదివాసి దుండగులకు పుట్టగతులు ఉండవని, ఖబర్దార్ దుండగుల్లారా అని హెచ్చరించారు. ఆదివాసీల సహనాన్ని పరీక్షించొద్దని నిజం ఎంతోకాలం తాగదని త్వరలోనే దుండగులు ఎవరో తెలుస్తుందని ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకుంటే దశలవారు ఉద్యమం తప్పదని అన్నారు. ఇప్పటికైనా ఆదివాసీలు మేలుకోవాలని అమరవీరుల విగ్రహాలు కూల్చి ఆదివాసుల ఆత్మగౌరవాలను దెబ్బతీసే దుండగులపై ఉద్యమ సమరసింహం మోగించాలని పిలుపునిచ్చారు.