తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు కవిత..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // హుజురాబాద్ )..
బిఆర్ఎస్ పార్టీ రజతోఉత్సవ సభ పరిశీలన సందర్భంగా ఎల్కతుర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత ని, తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ( నాంచారమ్మ ) ఎరుకల బుట్టను ఇచ్చి స్వాగతం పలికారు. కవిత ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలోనే ఎరుకల కులస్తులకు ఆత్మగౌరవం దొరికిందని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మకు గుర్తింపు వచ్చిందని తెలియజేశారు.800 సంవత్సరాల క్రితం కాకతీయుల రాజులు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజపురంలో నిర్మించిన ఎరుకల నాంచారమ్మ దేవాలయ పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ కేంద్రంగా ఎరుకల ఆత్మగౌరవ భవనంతో పాటు ఎరుకల ఎంపవర్మెంట్ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఎరుకల కులస్తుల కు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్ లో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు కూడా ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎరకల జాతిని గుర్తించి ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకల కులస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేతిరి రాజశేఖర్, మానుపాటి రమేష్, ఓని సదానందం, మానుపాటి సురేందర్, బిజిలి ప్రశాంత్, రాజేష్, భూనాద్రి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.