సబ్ టైటిల్ :-ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్
ములుగు (జిల్లా) వెంకటాపురం మండలం (నూగూరు),సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల హక్కులు,అభివృద్ధి ఫలాలు కోసం ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244(1) ఆర్టికల్ ఐదో షెడ్యూల్ ద్వారా ఆదివాసులకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులు ఉన్నాయని వాటిని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లమయ్యాయని ఆరోపించారు. వెంకటాపురం (Z) సర్వే నెం.4/1,4/2,68,69 ప్రభుత్వ భూములు వీటిని ఆక్రమించి వెంచర్లు నిర్మించి క్రయా విక్రయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ భూముల్లో నియమ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్, బహుళ అంతస్థులు కడుతున్న నిమ్మకు నీరెత్తినట్లు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని అమలు కాకుండా గిరిజనేతరులతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రభుత్వ భూములు కొన్న,అమ్మిన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు కృష్ణ బాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, నరసింహారావు, శ్రీను,శంకర్, నాగరాజు,రాజ్ కుమార్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.