డివిజన్ చైర్మన్ గా జల్లి నరేష్ ఏకగ్రీవ ఎన్నిక
పయనించేసూర్యుడు రిపోర్టర్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 22
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ చింతూరులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ సెంట్రల్ కమిటీ సభ్యులు మడివి నెహ్రూ, జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్, హాజరై చింతూరు డివిజన్ నూతన కమిటీని ప్రకటించడం జరిగింది.ఈ ఎన్నికలో ఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.వైస్ చైర్మన్స్ గా ఉయిక.రాంప్రసాద్,కారం.సాయిబాబు,శీలం.తమ్మయ్య,వెటకాని.మల్లయ్య,సున్నం.శేఖర్,కుంజా శ్రీను,పాగా.బాబురావు,ప్రచార కార్యదర్శిలుగా సోడే.శ్రీను,పాయం చంద్రయ్య కమిటీ సభ్యులుగా మడివి.రాజు,సోయం.కన్నారావు,పొడియం.లక్ష్మణ్,మాదాల.లోవరోజు బొక్కిలి.ప్రసాద్ లకు పాత కమిటీ వాళ్లతో పాటు చోటు దక్కింది.లీగల్ అడ్వైజర్ గా ఆత్రం.నవీన్, సమావేశానంతరం భవిష్యత్ కార్యాచరణగా ఏజెన్సీ ఉద్యోగ నియమకల చట్టం ప్రకటించేదాకా పోరాటం సాగుతుందని, జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కమిటీలు ఏర్పాటు చేసి డిసెంబర్ నెలలో జరిగే భారీ సభకు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతి పంచాయతీలో ఉన్న పెస కమిటీలతో ఐటీడీఏ ల ద్వారా శిక్షణ తరగతులు ఇచ్చి ప్రతి సమస్యపై ఆ కమిటీల ద్వారా తీర్మానాలు చేసే విధంగా ఈ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నూతన కమిటీకి జిల్లా రాష్ట్ర మరియు ఉద్యోగ సంఘాల వారు అభినందనలు తెలియజేసే భవిష్యత్తు పోరాటానికి సన్నద్ధం కావాలని ఆకాంక్షించారు.ఈ సమావేశానికి ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి.జోగారావు ఉద్యోగులు సంఘాల నాయకులు తిమ్మ సాయి,తొడం దేశయ్య, కాక రాజు,నాలుగు మండలాల సభ్యులు ప్రతినిధులు మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.