పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి 23
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం రిలే నిరాహార దీక్ష ను ఈరోజు చింతూరు ఎంపీపీ సవలం అమల, చట్టి గ్రామానికి చెందిన పెసా కమిటీ కార్యదర్శి పొడియం రామకృష్ణ (రాంబాబు) ఈరోజు దీక్ష ప్రాంగణంలో ముందుగా కొమరం భీమ్, బిర్సం ముండా ఫోటోలకు పూరదండలు వేసి అలాగే దీక్షలో పాల్గొన్న యువతీ యువకులకు పూలమాలవేసి దీక్షను ప్రారంభిన ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్,ఎంపీపీ సవలం అమల మాట్లాడుతూ ఆదివాసి పోరాటాలకు రాజకీయ పార్టీలు అడ్డు కాకూడదు అని తెలియజేస్తూ ఇటువంటి పోరాటాల్లో యువతి యువకులు భారీగా పాల్గొని భవిష్యత్తు తరాలకి ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ మన హక్కుల సాధనకై అందరూ ఐక్యతతో ముందుకు రావాలని తెలియజేశారు. అలాగే మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ఆదివాసి టీచర్స్ పోస్టులు మినహాయించి 100% ఉద్యోగాలను ఆదివాసి నిరుద్యోగులతో తోనే భర్తీ చేయాలి అలాగే ప్రత్యేక డిఎస్సి ని కూడా విడుదల చేయాలిడిమాండ్ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అరకులో ఆదివాసుల సాక్షిగా ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలీ అని డిమాండ్ చేస్తూ 28 శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలనిఅన్నారు ఐటీడీఏ ల ద్వారా ట్రైకర్ రుణాలు నిరుద్యోగ యువతీ, యువకులకు మంజూరు చేసి ఉపాధి కల్పించాలని మొదలైన సమస్యల పరిష్కార కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ పిలుపుమేరకు చట్టి గ్రామ యువతి, యువకులు, రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. దీక్షా కార్యక్రమంలో చింతూరు ఎంపీపీ సవలం. అమల, ఏడుగురాళ్లపల్లి సర్పంచ్ సత్తిబాబు, ఏసి కోడేరు సర్పంచ్ అగరం. సుబ్బలక్ష్మి, ముకునూరు సర్పంచ్ బి.సత్యకుమారి, గంగన్న మెట్ట సర్పంచ్ వేక. ప్రసాద్, తుమ్మల సర్పంచ్ కొవ్వసి. రామారావు, పేగ ఎంపిటిసి సున్నం. నాగరాజు, జేఏసీ చింతూరు మండల కార్యదర్శి కాకా. సీతారామయ్య. తుర్రం. అశోక్, సవలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.