పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 16 ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను
ఆదివాసి పట్టా భూములను అక్రమంగా నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి అనుభవించడమే కాకుండా ఆ భూములను ప్రభుత్వం సేకరించబోతున్న పోలవరం నిర్వాసితులకు ల్యాండ్ టు ల్యాండ్ సేకరించే భూముల్లో అమ్ముకోవటానికి అడ్డతీగల మండల ప్రాంతంలో కొంతమంది నాన్ ట్రైబల్స్ అమ్ముకోవటానికి కుట్రలు చేస్తున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను అన్నారు. గురువారం నాడు భూములు కోల్పోయిన ఆదివాసి బాధితులతో కలిసి అడ్డతీగల మండలం తాసిల్దార్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్తి ఆధారాలు పరిశీలించిన మీదటే భూములు విక్రయాలు జరుగుతాయని అధికారులు చెప్పినప్పటికీ లోపాయ కార ఒప్పందం తోటి పోలవరం ముంపు మండలాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ ఆదివాసి భూములను కబ్జా చేసి నాన్ ట్రైబల్స్ పోలవరం నష్టపరిహారం పొంది ఉన్నారని ఆయన ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. ఏ రిజిస్టర్ లో ట్రైబల్స్ పేరు ఉన్న భూములు మరియు ప్రభుత్వం పేరుతో ఉన్న భూములలో కూడా అక్రమంగా నాన్ ట్రైబల్స్ పరిహారం పొందిన సంఘటనలు దేవీపట్నం మండలంలో అనేకం ఉన్నాయని. ఇప్పుడు మల్ల ప్రభుత్వం నిర్వాసితులకు లాండ్ టు ల్యాండ్ సేకరించడంలో భాగంగా ముంపుకు గురికాని అడ్డతీగల రాజవొమ్మంగి వైరామవరం, గంగవరం తదితర ప్రాంతాలలో భూసేకరణలు జరుగుతున భాగంగా ఆదివాసి భూములను ప్రభుత్వ భూములను కబ్జా చేసిన నాన్ ట్రైబల్ భూ బకాసురులు ప్రభుత్వానికి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారని కావున స్థానిక రెవెన్యూ అధికారులు పోలవరం భూసేకరణ అధికారులు జిల్లా అధికారులు నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకున్న భూములను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని ఆయన కోరారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న నాన్ ట్రైబల్స్ ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం బలవంతంగా ప్రభుత్వ అవసరాలకు నిర్వసితుల కొరకు స్వాధీనం చేసుకోవాలని. అలా కాకుండా ఆదివాసి భూములను ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసి ఆదివాసులను భూమిలేని వారిగా మార్చొద్దని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ కోఆర్డినేటర్ పీట ప్రసాద్ అడ్డతీగల మండల నాయకులు ముళ్ళ పురుషోతం, బాధిత ఆదివాసి లు తదితరులు పాల్గొన్నారు.