ఆగస్టు 9 కోయ్ తోర్ పండుం దక్కడ్ కూనవరం. జయప్రదం చేయండి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 1
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2024 ఎన్నికల సందర్భంగా ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ రిజర్వేషన్ను ఎన్నికల హామీని అమలు చేయాలని ముందస్తు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి సంఘం రాష్ట్ర నాయకులు సీసం సురేష్ డిమాండ్ చేశారు.ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో చింతూరు మండల వ్యాప్తంగా ఎర్రంపేట, మల్లె తోట, మధు గురు, లక్కవరం, గ్రామాలలో ముందస్తు ప్రపంచ ఆదివాసి దినోత్సవం జెండా ఆవిష్కరణలు చేపట్టడం జరిగినది ఈ సందర్భంగా సీసం సురేష్, మండల నాయకులు కారం నాగేష్, మడకం చిన్నయ్య, కారం సుబ్బారావు, మాట్లాడుతూ ఏజెన్సీ ఆదివాసి ప్రజానీకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులను అమలు చేయకుండా నిర్లక్ష్యం వాయిస్తున్నాయని స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తి అవుతున్నాయని నేటికీ అభివృద్ధికి దూరంగానే ఆదివాసీలు జీవిస్తున్నారని రహదారులు లేక డోలిమాతలతో ప్రాణాలను విడిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరు ఎన్నికల సభలో 100% ఉద్యోగ రిజర్వేషన్ చట్టం చేస్తానన్న హామీని ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సమాజంలో జరుగుతున్న మార్పులకు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని పరిరక్షించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని ఆగస్టు 9న ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కూనవరం కేంద్రంలో కోయ్ తోర్ పండుం దక్కడ్ కూనవరం ఆదివాసి సంస్కృతిలో భాగమైన రేలాట,డోలు,కొమ్ము డోలు, అందె అట, ఆదివాసి ఆటపాటలు ఉంటాయని ఈ కార్యక్రమంలో ప్రజానీకం పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగినది, ఈ కార్యక్రమంలో, ధర్మల్ వీరభద్రం, ధర్ముల మల్లయ్య, మడకం సీతమ్మ, కారం కొండయ్య, పాండు నాగార్జున, కారం రాజయ్య, కారం మనోజ్, కోసం వీరయ్య, మీడియం సుబ్బు, తదితరులు పాల్గొన్నారు