ఆదివాసీ నిరుద్యోగులారా ! ఆదివాసీ యువ తరమా! కదలి రండి …
ఆదివాసీ హక్కుల సాధనకై కదలి రండి కదలి రండి !…
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 29
ఆదివాసీ సంఘాల కూటమి"(ASK) నాయకులు పిలుపు
ఏప్రిల్ 30 న రంపచోడవరం ఐ టి డి ఎ పరిధిలో ఉన్న ఆదివాసీ నిరుద్యోగులు, యువత, ఆదివాసీ ప్రజా సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరు ఛలో రంపచోడవరం కార్యక్రమం విజయవంతం చేయాలని "ఆదివాసీ సంఘాల కూటమి" (ఏ యస్ కె) నాయకులు "ఆదివాసీ చైతన్య వేదిక" అధ్యక్షులు వెదుళ్ల లచ్చిరెడ్డి "ఆదివాసీ గిరిజన సంఘం" రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు "ఆదివాసీ సంక్షేమ పరిషత్" (274/16) జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు మరియు "ఆదివాసీ ఉద్యోగ సంస్కృతిక సంక్షేమ సంఘం" అడ్డతీగల వారు పిలుపునిచ్చారు ఆదివాసీ నిరుద్యోగులు, విద్యార్థులు, యువత అలాగే డి యస్ సి కి సిద్దపడేవారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని, ఈ పోరాటం వారి కోసమేనని, వారి కోసం చేసే పోరాటంలో వారు పాల్గొనకపోతే వారి అంత మూర్ఖులు ఇంక ఎవరు ఉండరని అన్నారు. ఆదివాసీ నిరుద్యోగులు, యువత తప్పకుండా కదలి రావాలని, ఆదివాసీ హక్కుల సాధనకై ఉప్పెనలా పరుగేడుతూ, తుపానులా విరుసుకుపడుతూ, రా కదలి రా అంటూ ఒకరికొకరు కలసికట్టుగా కదలి రండి కదలి రండి అంటూ కదలి రావాలని కోరారు.