మరణాలకు కారణమవుతున్న ఉద్యోగులను సస్పెండ్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయా?
పాఠశాలలో విద్యార్థులు మరణాలకు కారుకులైన ఉద్యోగులపై, ఆస్పత్రులలో మరణాలకు కారుకులవుతున్న డాక్టర్లపై, ఇంత జరుగుతున్న నిర్లక్ష్య వైఖరితో నడుచుకుంటున్న ఉన్నత అధికారులపై క్రిమినల్ కేసులు వెయ్యాలి - కుంజ శ్రీను డిమాండ్ గతంలో జరిగిన వాటితో పోలిస్తే ఎన్నడు లేని విధంగా 2025 సంవత్సరంలో రంపచోడవరం ఏజెన్సీ ఆదివాసుల మరణాలకు కేరాఫ్ గా మారిందని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆవేదన వ్యక్తపరిచారు. ఒకపక్క ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీలు మృత్యువాత పడతా ఉంటే, మరోపక్క పాఠశాల, వసతి గృహాల లోని సిబ్బంది నిర్లక్ష్యము కారణంగా ఆదివాసి విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఇంత జరుగుతున్న రంపచోడవరంలో నియోజకవర్గం లోని ఉన్నత అధికారులు, జిల్లా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని, మరణాలు సంభవించిన తర్వాత విచారణ పేరుతోటి ఐఏఎస్ అధికారులు కాలయాపనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జరిగిన ప్రతి సంఘటనపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వారు విచారణలకు ఆదేశిస్తున్నారని కానీ ఇప్పటివరకు ఏ విచారణకు సంబంధించినటువంటి వివరాలు బయటకు రాలేదని ఆయన ఆరోపించారు. గతంలో రంపచోడవరం ఆస్పత్రిలో మరణించిన కాకూరు పార్వతి మృతి పై విచారణ చేపడుతానని చెప్పిన రంపచోడవరం ఐటీడీఏ పీవో ఇప్పటివరకు ఆ విచారణ ఏమైంది కూడా తెలియదని, అంతకుముందు ఆ తర్వాత కూడా అదే ఆసుపత్రిలో అడ్మిట్ అయి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చాలామంది రోగులు మృత్యువాత పడ్డారని ఇప్పటివరకు వాటిపై ఎటువంటి చర్యలు లెవ్వు అని ఆయన మండిపడ్డారు. మారేడుమిల్లి రంపచోడవరం ఆశ్రమం పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల మృతి పై కూడా విచారణ ఆదేశించిన ఐటిడిఏ పిఓ రెండు రోజుల తర్వాత వాటిని మర్చిపోతారని ఆయన విమర్శించారు. సంఘటన జరిగిన తర్వాత పాఠశాల సిబ్బందిని, వైద్య సిబ్బందిని బాధితులను మభ్యపెట్టటానకే సస్పెండ్ చేస్తున్నారు తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నత అధికారులకు లేదని ఆయన విమర్శించారు. సస్పెండ్ చేస్తే సరిపోదని పాఠశాలల్లో విద్యార్థులు, ఆసుపత్రిలో రోగులు మృత్యువాత పడటానికి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల వసతి గృహ సిబ్బందిపై ఆసుపత్రి సిబ్బంది లపై అలాగే సరైన పర్యవేక్షణ చేయని ఉన్నత అధికారులపై క్రిమినల్ కేసులు వెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా విచారణ పేరుతో ఉన్నత అధికారులు దాగుడుమూతలు ఆడుకుంటూ, బాధితులని ప్రజల్ని మభ్యపెట్టడానికి కంటి తుడుపు చర్యగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందులపై సస్పెన్షన్ వేటు ఏ రకమైన మార్పులకు దారితీయదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అన్నారు. నిత్యం పర్యవేక్షణ చేయవలసిన అధికారులు నెలనెలా కాసులకు కక్కుర్తి పడుతూ వసతి గృహాల్లో పాఠశాలలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోకుండా కళ్ళు మూసుకుపోయిన హాస్టల్ వెల్ఫేర్ (ATW's) అధికారుల పై, విద్యాశాఖ(MEO's) అధికారులపై, వైద్యశాఖ(Superdents, Dy.&Addl. DM&HO's, DM&HO's) అధికారులపై మరియు ఈ అధికారులను నిరంతరం సరిగ్గా పనిచేసేలా చూసుకోవలసిన ఐఏఎస్( ఐటీడీఏ పీవోలు, సబ్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు ) అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులను మరియు ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు