పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 12
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలంలో ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో చింతూరు బస్ స్టాండ్ నుండి చింతూరు మెన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం చింతూరు డివిజన్ చెర్మన్ జేఏసీ నాయకులు జల్లి నరేష్ మాట్లాడుతూ చింతూరు డివిజన్ కూనవరం మండలం లో కోతుల గుట్టలోని ఆదివాసి అమరుడైన కొమరం భీమ్ విగ్రహాన్ని గుర్తుతెలియని దండుగులు ద్వంసం చేయడానికి ఆదివాసి జేఏసి తీవ్రంగా ఖండిస్తుందని హెచ్చరించారు, దండుగుల ప్రతాపం అమరవీరుల విగ్రహాలపై కాదని ధైర్యం ఉంటే ముఖాముఖిగా ఆదివాసులతో తలపడాలని చింతూరు డివిజన్ చెర్మన్ జల్లి నరేష్ సవాల్ విసిరారు. ఈ విషయంపై గౌరవ పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి దండగలను పట్టుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు, అమరవీరుల విగ్రహాలపై దాడి చేసి ఆదివాసులను భయపట్టలేరని ఆదివాసి పోరాటాలను ఆపలేరని, ఇటువంటి తాటాకు చప్పలకు ఆదివాసులు భయపడరని హెచ్చరించారు. అయితే కొమరం భీమ్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం అంటే ఆదివాసుల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అని ఆదివాసులపై దాడి చేయడమే అని దీన్ని ఆదివాసుల ఆదివాసి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని ప్రభుత్వం మరియు అధికారులు దీనిపై స్పందించుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చింతూరు డివిజన్ జేఏసీ చెర్మన్ జల్లి నరేష్, చింతూరు జేఏసీ వైస్ చెర్మన్ శీలం తమ్మయ్య, చింతూరు మండల జేఏసీ కార్య దర్శి కాక సీతారామయ్య, బొడ్డు బలరాం జేఏసీ ఆదివాసి ఉద్యోగ సంఘ అధ్యక్షులు చింతూరు, తిమ్మ సాయి, కణితి గణేష్, సోడే నారాయణ, తోడం దేసయ్య, కొరస్స భద్రయ్య, మడివి రాజు జేఏసీ, కార్యదర్శి, కారం చందు, చోడే రాఘవయ్య, అనిగే చంద్రయ్య, పొడియం లక్ష్మణ్, పద్దం అర్జున్, దుమ్మిరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.