పయనించే సూర్యుడు జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 10 : ఆదివాసీ సమాజానికి గందరగోళం సృష్టించవద్దని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు హెచ్చరించారు.భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్ ఉంది.5వ షెడ్యూల్డ్ లో విధాన పరమైన నిర్ణయం గిరిజన సలహా మండలి(టిఎసి)ద్వారానే జరుగుతుంది.కొంతమంది జిఓ నెం 3కి బదులుగా ఆర్డినెన్స్ ఇవ్వాలంటారు.ఆర్డినెన్స్ అనేది పార్లమెంట్ లేదా అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు అత్యవసరంగా చేసుకొనే చట్టం.కేంద్రంలో రాష్ట్రపతికి రాష్ట్రంలో గవర్నర్ కి అధికరణ 123 మరియు అధికరణ 213 ద్వారా ఇవ్వబడ్డాయి.షెడ్యూల్ ప్రాంతంలో అత్యవసరంగా చట్టం చేసుకోవాలంటే గిరిజన సలహా మండలి(టిఎసి)ని సమావేశ పరిస్తే సరిపోతుంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా ఇప్పటికే ఉన్న చట్టాన్ని షెడ్యూల్ ప్రాంతానికి అనుకూలంగా మార్చుకోవటం లేదా కొత్త చట్టాన్ని తయారు చేసుకునే అధికారం గిరిజన సలహా మండలి(టిఎసి)కి ఇవ్వబడింది. జిఒనెం 3 రద్దు అయ్యి గత మూడు సంవత్సరాలుగా ఆర్డినెన్స్, ఆర్డినెన్స్ అంటున్నారు కొందరు,గత మూడు సంవత్సరాలలో 9 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ ప్రాంతానికి సంబంధంలేని ఆర్డినెన్స్ ప్రస్తావన ఎందుకు వస్తుందో,ఆర్టికల్ 244(1) అనుసరించి గవర్నర్ ద్వారా చట్టం చేయవచ్చు.అసెంబ్లీకి సంబంధం లేదు.ఒక రోజు గిరిజన సలహా మండలి తీర్మానం చేస్తే,ఇంకొక రోజు గవర్నర్ ఆమోదం చేస్తే,రెండు రోజుల్లో చట్టం చేసుకోవచ్చు,కావల్సిందల్లా చిత్తశుద్ధి.చట్టం లేకుండా జిఓ ఇస్తే కోర్టు కొట్టివేస్తుంది.సామాన్యులకు కూడా అర్థమయ్యే సులువైన పద్ధతిలో షెడ్యూల్ ప్రాంతంలో చట్టాలు చేసుకునే వెసులు బాటు రాజ్యాంగం కల్పించింది. అది అర్థం కాకో లేక ఆదివాసులకు మేలు చేకూర్చటం ఇష్టం లేకో సంబంధిత అధికారులు ఆ ప్రక్రియను అనుసరించటం లేదు. రాజ్యాంగబద్ధంగా జిఓ నెం 3 వచ్చినప్పటికీ రాజ్యాంగ ప్రక్రియను అనుసరించలేదనే సాంకేతిక కారణాన్ని చూపించి 2018లో వాదనలు ముగిసిన కేసు తీర్పును 2020 ఏప్రిల్ 22న ఇవ్వడం జరిగింది. ఆదివాసీల శ్రేయోభిలాషులు అనే ముసుగులో కొంతమంది 5వ షెడ్యూల్ కు సంబంధంలేని పదాలను వాడుతూ అమాయక ఆదివాసీలను తికమక పెడుతూ అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఆదివాసీలకు కీడు చేయాలని ఆలోచన కలిగిన కొందరు అధికారులకు బలాన్ని చేకూరుస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టినా కూడా మాట్లాడలేకపోవడం ఆదివాసీల దౌర్భాగ్యం.రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్ ద్వారా 5వ షెడ్యూల్డ్ ప్రాంతానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకుని వస్తారు. రాజ్యాంగంలో చట్టాలు చేసే విధానం 10 భాగం,5వ షెడ్యూల్డ్ లో ఉండగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలా తీసుకొని వస్తారు,దేని కొరకు తీసుకొస్తారు. 5వ షెడ్యూల్డ్ ప్రాంతానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనే ప్రస్తావనే లేదు,ఆర్డినెన్స్ అనే ప్రస్తావనే లేదు.రాజ్యాంగంలో 10 వ భాగం,5 వ షెడ్యూల్డ్ లో స్పష్టంగా పేరా 5(1),5(2)ప్రకారం చట్టాలు చేసుకోవచ్చని చెబుతుంటే,అ విధానం ప్రస్తావించకుండా, ఆ విధానం ఆదివాసీలకు తెలపకుండా రాజ్యాంగంలో ఉన్నవి మాట్లాడకుండా,ఆదివాసీలకు అర్ధం కానీ పదాలను వాడుతున్నారు.రాజ్యాంగంలో ఉన్న పదాలను వాడడానికి వారికి ఏమైనా నామోషీగా ఉందా లేక పెద్ద పెద్ద పదాలు వాడితే గొప్పతనం వస్తుందని వాడుతున్నారా అని ఆయన ఎద్దేవా చేశారు.