ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయఉపాధ్యక్షులు ఉయిక శంకర్.పయనించేసూర్యుడు: జనవరి19:ములుగు జిల్లా వాజేడు మండలప్రతినిధి. రామ్మూర్తి.ఎ.... వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని
శనివారం పేరూరు గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 20 జనవరి 2025 నా ఏటూరు నాగారం ఐ టి డి ఏ నందు ఆదివాసి సమస్యలను పరిష్కరించుటకై ర్యాలీ, మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు ఉయిక శంకర్,ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ , ఏటూరు నాగారం డివిజన్ అధ్యక్షులు టింగ భుచ్చయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఐదో ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలు 1/70 చట్టం అటువై హక్కుల చట్టం ఫేస్ చట్టాలు వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు,పాలకులకు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీలో గిరిజనేతరులకు అన్ని విధాలుగా హక్కులు కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు పోడు సాగు వ్యవసాయం చేసుకుంటు ఉంటే ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల పై దౌర్జన్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఆదివాసులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకుంటూ ఏజెన్సీ ప్రాంతాలు చట్టాలను తుంగలో తొక్కుతూ గిరిజన ఇతరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఉన్న అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్ష అని వాపోయారు. అందుకే మన ఐటీడీఏ ఏటూరు నాగారం నందు మన హక్కులు, మన చట్టాలు, మన ఉద్యోగం, మన ఉపాధి, మనభూమి, మన రిజర్వేషన్, మనగడలను రక్షించుటకై 20 జనవరి 2025 న ఏటూరు నాగారం ఐటీడీఏ నందు ర్యాలీ, మహాధర్నను జయప్రదం చేయాలని ఆదివాసి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల నాయకులు తుర్స కృష్ణ బాబు, లోడిగ నరసింహరావు, తాటి రాంబాబు, తొర్రెం మనోజ్, పోశెట్టి మహేష్, టింగ ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.