పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలో ఏప్రిల్ 3 తేదీ నుంచి 11 తేదీ వరకు ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయలలిత బుధవారం తెలిపారు.0-6 ఏళ్ల పిల్లల కోసం కొత్త ఆధార్ నమోదు లేదా మార్పుల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.పాడేరు,యనమదల, నాగులవెల్లటూరు సచివాలయాల్లో ఏప్రిల్ 2 తేదీ నుండి 5 తేదీ వరకు, పెరుమలపాడు,కోతితీర్థం, నెర్నూరు సచివాలయాల్లో ఏప్రిల్ 8 తేదీ నుండి 11 తేదీ వరకు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని ఆయా గ్రామ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆమె తెలిపారు