
పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
ఆధునిక సాంకేతిక, నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ప్రముఖ రేడియాలజిస్ట్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.శనివారం విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రేడియాలాజిస్ట్, ఇమేజింగ్ అసోసియేషన్ 11వ రాష్ట్ర కాన్ఫెరెన్స్- 2025 లో ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న రేడియాలజీ నిపుణులు ఒకే వేదికపై కలిసి ఆరోగ్యరంగ అభివృద్ధి కోసం చర్చించడం నిజంగా ప్రేరణనిచ్చే విషయం అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు ఆరోగ్య సేవలలో కొత్త సాంకేతికతలు, నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని, ఐ ఆర్ ఐ ఏ లక్ష్యం కూడా అదేనని ఆమె అభినందించారు.
