పయనించే సూర్యుడు, అక్టోబర్ 02 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఇరవైండి రోడ్లో ఆధ్యాత్మిక సేవాసమితి వారి ఆధ్వర్యంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన అమ్మవారి మండపం వద్ద ప్రతిరోజు అమ్మవారు వివిధ అవతారములలో భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక సేవా సమితి వారు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సేవా సమితి వారు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా అమ్మవారి మండపం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా విజయవాడ నుండి తెప్పించిన 20వేల గాజులతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుందని ఈ గాజులను దేవి శరన్నవరాత్రులు ముగిసిన అనంతరం అమ్మవారి నిమజ్జనం పూర్తయిన తరువాత గ్రామంలోని మహిళలందరికీ ఈ గాజులను ప్రసాదంగా పంచడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భాగంగా తొమ్మిది రోజులు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి పూజా కార్యక్రమాలకు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు భక్తులు మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు