పయనించే సూర్యుడు ఆగస్టు 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా 40 ఇండ్ల కేటాయింపు పూర్తి
పింజర మడుగు, ముచ్చర్ల ప్రాంతాల్లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేసిన జిల్లా కలెక్టర్
లబ్ధిదారులకు ఆన్ లైన్ ర్యాండమైజేషన్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా కేటాయించామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి కామేపల్లి మండలం పింజరమడుగు, ముచ్చర్ల ప్రాంతాల్లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పింజరమడుగు, ముచ్చర్ల ప్రాంతాల్లో నిర్మించి చాలా రోజులుగా పెండింగ్ ఉన్న 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేయడం జరిగిందని అన్నారు. నేడు జరిగిన అలాట్ మెంట్ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేసిన ఇండ్ల పట్టాలను త్వరలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేస్తామని అన్నారు. పింజరమడుగు గ్రామంలో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, ముచ్చర్ల గ్రామంలో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గతంలోనే లబ్దిదారుల ఎంపిక పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, ఏ లబ్దిదారుడికి ఏ నెంబర్ ఇండ్లు కేటాయించాలనే అంశం పూర్తి పారదర్శకంగా ఎటువంటి పైరవీలు లేకుండా ఆన్ లైన్ ద్వారా కేటాయించామని అన్నారు.ఈ సమావేశంలో కామేపల్లి తహసీల్దార్ సుధాకర్, పింజరమడుగు, ముచ్చర్ల డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.