గుల్లా కరుణ,చల్లా సూర్యకాంతంలను పరామర్శించి 5 వేల చొప్పున సహాయం
పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) ఆగస్టు, 22:-
నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న ఎవరికైనా సహాయం చేయడమే ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజు న్నారు.శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకులు గుల్లా ఆనంద్ భార్య కరుణకి,చల్లా సూర్యకాంతంలకు ఇటీవల పెరాలసిస్ రావడంతో వారిని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఒక్కొక్క కుటుంబానికి 5 వేల రూపాయలు చొప్పున 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సిపి నాయకులు,నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో అన్నవరం ఎంపీటీసీ దడాల సతీష్,వైస్సార్సీపీ సీనియర్ నాయకులు కొండపల్లి అప్పారావు, వైస్ సర్పంచ్ బొబ్బిలి వెంకన్నబాబు,తాటిపాక కృష్ణ,బలువు బాబి,ఎంపీటీసీ కొండి సతీష్ ,పెద్దింటి లక్ష్మణ్ ,బలువు హరిబాబు,పలివెల కొండలరావు,గంపల జయరాజు,పలివెల ఈశ్వరరావు,కోణాల శ్యామ్,బొల్లు నాగేశ్వరరావు,పోకనాటి వెంకటేశ్వరరావు,జువ్వల దొరబాబు తదితరులు పాల్గొన్నారు