
వైద్య చికిత్స కోసం వడ్ల సుదర్శన చారికి రూ. 3 లక్షల ఎల్ఓసి అందచేత
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యం చేయించుకోలేని కొత్తూరు మండల ఇన్ముల్ నార్వ గ్రామవాసి వడ్ల సుదర్శన చారికి మెరుగైన చికిత్స నిమిత్తం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని ఆర్థిక సహాయం కోరగా స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రూ. 3 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాన్ని మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అజయ్ నాయక్,తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి,మాజీ ఎంపిటిసి బాల్ రాజ్, నాయకులుఇంద్ర సేన రెడ్డి, కే.కుమార్, కే.నర్సిమ శివ చారి తదితరులు పాల్గొన్నారు.