ఆదివాసీ హాక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగ సభను విజయవంతం చేయండి
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్రకోకన్వీనర్ మెంతిన సంజీవరావు
పయనించే సూర్యుడు ఆగస్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి : ఆదివాసి పోరాట హక్కుల సంఘీభావ ఐక్యవేదిక అధ్వర్యంలో ఈ నెల 24-08-25 తేదీన హన్మకొండ అంబేడ్కర్ భవన్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ,ఆదివాసీ హక్కులు-కార్పొరేటీకరణ కగార్ హత్యాకాండ-కాల్పుల విరమణ అంశంపై ఈ నెల 24-08-25 తేదీన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ భవన్ లో జరిగే బహిరంగ ను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అధ్వర్యంలో నేడు టేకులపల్లి బోడు రోడ్డు సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ మెంతిని సంజీవరావు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య దేవా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు తుడుం దెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్తీ వీరభద్రం, ఆదివాసీ హక్కుల పొరాట సంఘీభావ వేదిక జిల్లా నాయకులు ఎట్టి ప్రశాంత్ మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ మధ్యభారత దేశంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ లకు కట్టబెట్టడంకోసం దండకారణ్యంలోని ఆదివాసీలను ,ఆదివాసీల పక్షాన పోరాడుతున్న మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరిట అంతమొందించాలని పాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు.భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషి జీవించే హక్కు ఉందని,కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రజల జీవించే హక్కును కాలరాస్తుందని,ఆదివాసీల రక్షణకోసం రూపొందించిన చట్టాలను తుంగలో తొక్కుతూ ఆపరేషన్ కగార్ పేరిట మారణకాండకొనసాగిస్తుందని, ఆదివాసీలమీద హత్యాకాండా కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలపేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు, విద్యార్థులు, కార్మికులు మేధావులు ఆదివాసీ హాక్కుల పోరాట సంఘీభావ వేదిక అధ్వర్యంలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు బానోతు లక్పతి , చింత అజయ్, కుంజ భద్రం, గణేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు