పెద్ద శంకరంపేట లో అసలు ఆయుర్వేద హాస్పిటల్ ఉందా లేదా అని ప్రశ్నార్థకంగా మారింది
పయనించే సూర్యుడు అక్టోబర్ 14 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరం పేట్ లోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ అనారోగ్యం సోకినట్టుంది ఈ హాస్పిటల్ కు నిత్యం రోగులు వస్తారు కానీ అందులో మాత్రం డాక్టర్ మరియు సిబ్బంది సమయానికి ఎవరు ఉండరు సోమవారం ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ లో చూపించుకోవడానికి వచ్చిన అనారోగ్యంతో బాధతో వచ్చినవారికి మూసి ఉన్న తలుపులు తాళాలు ఎదురయ్యాయి తెరుచ్కొని ఉదయం వచ్చి కూర్చున్న మధ్యాహ్నం వరకు హాస్పిటల్ తాళాలు ఎవరూ తీయలేదు అసలు ఈ దవఖానల్లో సిబ్బంది డాక్టర్ ఉన్నారా లేదా అని అనుమానం కలుగుతుంది ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఖర్చుచేసిన ఫలితం శూన్యంలా కనిపిస్తుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమయపాలన పాటించాలని డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉండేటట్లు తక్షణమే చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.