పయనించే సూర్యుడు న్యూస్// 7 తేదీ ఏప్రిల్ నారాయణపేట జిల్లా
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 8న నిరసన దినం జరపాలని పిలుపునిచ్చింది అందులో భాగంగా నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వర్ సెంటర్ గా ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు జి వెంకట్ రెడ్డి, సిద్దు మాట్లాడుతూ దేశంలో మూడవసారి అధికారాన్ని చెప్పేట్టిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు మన దేశ కార్మిక వర్గం మంచి భద్రత కోసం మంచి వేతనాల కోసం ఉద్యమిస్తుంటే మరోవైపు రైతులు ఎంఎస్పి కోసం గిట్టుబాటు ధరల హామీ ఋణ రద్దు డిమాండ్లతో పోరాడుతున్నారు. సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాల కోసం వ్యవసాయ కార్మికులు భూమిలేని పేద రైతులు భూమికోసం పోరాటం కొనసాగిస్తున్నారు విద్య ఉపాధి సామాజిక న్యాయం కోసం యువత సురక్షితమైన ఉపాధి కోసం విద్యార్థులు సార్వత్రిక ఉచిత లౌకిక శాస్త్రీయ విద్య కోసం మహిళల భద్రత కోసం సమానత్వం కోసం ప్రతిష్ట కోసం ఆందోళనలు నిర్వహిస్తా ఉన్నారు మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు జీవనం భద్రతకై జీవనోపాధి కోసం పోరాడుతున్నారు. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకపోగా బిజెపి ప్రభుత్వం వీఎస్పీ బజరంగ్ దళ్ తదితర ఆర్ఎస్ఎస్ పరివారమంతా 1773లో చనిపోయిన ఔరంగజేబు సమాధి గొడవను రేకెత్తించి అమాయక హిందూ ప్రజలను రెచ్చగొట్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు ఎంతవరకు సమంజసం అన్నారు ఔరంగజేబు సమాధి పేరుతో మరొకచోట మసీదు కింద మందిర్ ఉందని మరికొన్ని చోట్ల హోలీ పండుగ సందర్భంగా చాలా చోట్ల తమ మత ఎజెండాను తీవ్రమైన ప్రజల మీద ఒత్తిడి చేస్తా ఉన్నది ప్రజల మధ్య వైశాల్యాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నది సాంస్కృతిక దాడి జరుగుతుందన్నారు సమాజాన్ని అత్యంత విషపూరితం చేస్తూ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నది అన్నారు ఈ సంస్థలన్నీ శ్రమించే ప్రజలకనీస తక్షణ సమస్యలను కూడా పరిష్కరించడం లేదని విమర్శించారు 23 పంటల వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర ప్రకటించలేదు స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా సీటు ప్లస్ 50 వాపోయారు.ముఖ్యంగా కార్మిక రైతాంగం ప్రజల పట్ల నిరంకుశంగా ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్నది. ఇట్టి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉన్న ప్రజలు కార్పొరేట్ సంబంధాలను వేరు చేయటానికి ప్రతిఘటించాలని ఓడించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏప్రిల్ 8న జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు కార్మికులు యువకులు మేధావులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ మండల కార్యదర్శి కే మల్లేష్ గ్రామ పార్టీ నాయకులు జి గోవర్ధన్ రెడ్డి టీ కథలప్ప అంజు,రాజు యువకులు పాల్గొన్నారు.