వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ 2 లక్షల 81 వేల ఖాతాలో కలి బాధితుడు సైబర్ క్రైమ్ ను ఆశ్రయించి ఫిర్యాదుచేశారు
పయనించే సూర్యుడు గాంధారి:21-02-25 వినే వాడికి చెప్పేవాడు లోకు అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలర్ ట్యూన్ కి బదులుగా సైబర్ నేరాగాల నుండి వచ్చే వీడియో కాల్ లను మోసపోవద్దని ఎంతగానో ముమ్మర ప్రచారం చేసిన అందరికీ ప్రయోజనం చేకూరడం లేదు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఓ పాల వ్యాపారికి ఎన్సిసి మండల కేంద్రానికి తమ ఆర్మీ క్యాంపు వస్తుందని వీడియో కాల్ చేయడం జరిగింది. అంతేకాకుండా పాల వ్యాపారిని నమ్మించేందుకు ఆర్మీ ఐడి కార్డ్, మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్, కేజ విబి ఫోటోలను కూడా పంపడంతో ఇది మా ఊరే కదా అనుకొని సదురుపాల వ్యాపారి నమ్మాడు. దీంతో పాల వ్యాపారి అతనితోవీడియో కాల్ మాట్లాడుతూ అతని యొక్క కుమారుడు అకౌంట్ ను పంపించాడు అడ్వాన్సుగా కుమారుడా అకౌంట్ కు 10000 రూపాయలు జమ చేయడం జరిగిందని పాల వ్యాపారి తెలిపాడు. అయితే 60 వేల రూపాయలు జమ చేసిన తర్వాత అతని యొక్క కుమారుడు ఫోన్‌పే ఓపెన్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే ముందుగా 60000 తర్వాత 99000 తర్వాత 60000 అటుపై 62000 4 విడతలలో అతని అకౌంట్లో నుండి మొత్తం 281,000 పూర్తిగా ఖాళీ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది.