
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
ఈరోజు శనివారం రోజున ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇటీవల సర్పంచ్‌లుగా గెలుపొందిన వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాట్ పల్లి నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని, సర్పంచ్‌లు గ్రామాలలో ప్రజలకు ఏ హామీలు ఐతే ఇచ్చారో కచ్చితంగా నేరెవర్చే బాధ్యత మేము తీస్కుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధి పట్ల శ్రద్ద చూపుతున్నారని, రాష్టం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే గ్రామ అభివృద్ధి ముఖ్యమని వారు తెలిపారు.బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వీబీ జి రాం జీ ఉపాధి చట్టంను గ్రామ స్థాయిలో సర్పంచ్‌లు అందరు కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపాలన్నారు.అదేవిదంగా ఆర్మూర్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి ఎల్లపుడు రేవంత్ రెడ్డి తో మరియు జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికలలో జిల్లాలో వున్నా మూడు మున్సిపాలిటీలను మరియు ఒక నగర కార్పొరేషన్ ను జిల్లా ముఖ్య నాయకులు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్కుంటుందని ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులను గెలిచి రేవంత్ రెడ్డి కి బహుమతిగా ఇద్దామన్నారు.త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను అధిక సంఖ్యలో గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ ను కైవసం చేస్కుకుంటామని తెలిపారు .ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికయినా సర్పంచ్‌లను సన్మానించారు.ఈ సందర్బంగా పలు పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మరియు నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్నా , పట్టణ అధ్యక్షులు సాయిబాబా ,జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార చంద్రమోహన్ నందిపేట్ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ మాక్లూర్ మండల అధ్యక్షులు రవి ప్రకాష్ డొంకేశ్వర్ మండల అధ్యక్షు డు భూమేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ మండల అధ్యక్షుడు చిన్నా రెడ్డి ఆలూర్ మండల అధ్యక్షులు విజయ్ వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
