పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 5
అల్లూరి సీతారామరాజు జిల్లా ఈరోజు రంపచోడవరం గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ గారు మరియు నియోజకవర్గ యువజన అధ్యక్షులు శ్రీ మఠం విజయభాస్కర్ గారు అమరావతి సెక్రటర్రియేట్ నందు గౌరవ కమీషనర్ R&R(రీసెటిల్ మెంట్&రీ హేబిలిటేషన్ మరియు వాటర్ రిసోర్స్&ఇరిగేషన్) వారిని కలిసి నియోజకవర్గ పరిధిలోగల R&R సమస్యలు, రీసర్వే ,పెండింగ్ ప్యాకేజీ కోసం చర్చించి సమస్యలు త్వరగా పూర్తి చేయాలని అదే విధముగా అర్హులైన అందరికి లబ్ది చేకూరేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగినది .
గౌరవ కమీషనర్ గారు స్పందించి అర్హులు అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఏమైనా చిన్న చిన్న లోపాలతో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది.