
పయనించే సూర్యుడు ఆగస్టు 9 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) ఆల్ ఇండియా తౌహీద్జమాత్ మరియు తిరుపతి(SVRR) రుయా హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరం 09-08-2026, ఆదివారం, సూళ్లూరుపేట R&B, సూళ్లూరు పేట(సిఐ మురళీకృష్ణ) ముఖ్య అతిథిగా పాల్గొనవలసిన కార్యక్రమాని కి అనివార్య కారణాలవల్ల ఆయనకు బదులుగా సూళ్లూరుపేట ఎస్సై పాల్గొన్నారు ఈ రక్తదాన శిబిరంలో అనేకమంది పాల్గొని తమ రక్తాన్ని దానం చేసి ఈ శిబిరాన్ని జయప్రదం చేశారు ఈ శిబిరా ఏర్పాట్లను చేసుకోవడానికి అనుమతించిన సూళ్లూరుపేట రోడ్లు భవనాల శాఖ అధికారులకు మరియు ఈ ప్రాంతాన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు నెరవేర్చి కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుకోవడానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ కి మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ {AITJ} ఆల్ ఇండియా తౌహీద్ జమాత్ సూళ్లూరుపేట శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటుంది