పయనించే సూర్యుడు జనవరి 17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్... ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశ స్వాతంత్రం పై చేసిన వ్యాఖ్యలు చాలా గర్హనీయం. రామ మందిరం నిర్మాణం తర్వాత నే అసలైన స్వాతంత్రం వచ్చింది అని చేసిన వ్యాఖ్యలు బి ఆర్ అంబేద్కర్ ని మరియు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర యోధులని అవమానించినట్లు గా భావించి మోహన్ భగవత్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి దేశ బహిష్కరణ చేయాల్సింది గా యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జూపల్లి కోదండ రామారావు, అశ్వారావుపేట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగ కిషోర్ యూత్ కాంగ్రెస్ నాయకులు తరుణ్ శ్రీను ప్రవీణ్ షఫీ అల్లాడి రామారావు గుమ్మల గోపి అశోక్ పండు మునీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.