పయనించె సూర్యుడు ఏప్రిల్ 20 టేకులపల్లి ప్రతినిధి (పోనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం సులానగర్ ఆర్ సి ఎం చర్చిలో ఫాదర్ మార్నేని అర్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు జరిగాయిదేవాలయంలో ఫాదర్ మార్నేని అర్లయ్య ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ నేడు ఏసు క్రీస్తు సమాధి నుంచి సజీవుడై పునరుత్థానం చెందిన దినం అని, హింస ద్వేషాలు మరణాన్ని ఇస్తాయి, ప్రేమా ,క్షమాపణలు జీవితానికి నూతనత్వాన్ని ఇస్తాయి ఇది నిరూపించడానికె సమాధి నుంచి సజీవుడై తిరిగి వచ్చాడు క్రీస్తు అన్నారు,అనంతరం ఆలయంలో కేక్ కట్ చేసి కొవ్వొత్తులు వెలిగిస్తూ భక్తులు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈస్టర్ ఫుడ్ స్వీకరించారు.ఈ కార్యక్రమం లోచర్చి యూత్ కర్లపూడి సామ్యేల్, చింతమల్ల వీరస్వామి, అంతోటి రాకేష్,వల్లాల రవీందర్, దామర్ల శశి,మెట్టు రాజేష్, బల్లెం థామస్,గండమల్ల విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.ఎండ్ న్యూస్