//పయనించే సూర్యుడు/* జులై 15//మక్తల్
మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ భూమితో పాటు మున్సిపల్ స్థలాన్ని కొందరు కబ్జాదారులు కబ్జా చేసి అక్రమంగా ప్లాట్లను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకొని భూకబ్జాలను ఆపాలని వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్, హిందు వాహిని ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణమ్మకు వినతి పత్రం అందజేశారు. మక్తల్ పట్టణంలోని సర్వే నెంబర్లు 34, 35, 44లలో కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీకి విన్నవించారు. ఈ భూమిని కాజేసేందుకు గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని, కానీ తాజాగా అధికార బలంతో కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి జి. బలరాంరెడ్డి, మల్లికార్జున్, భీమ్ రెడ్డి, భీమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.