
పయనించే సూర్యుడుD.10.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన రూ : 3.02 కోట్లాది రూపాయల విలువైన ఆస్తులపై జప్తు చర్యలుఅంతర్రాష్ట్ర డ్రగ్ అక్రమ సరఫరా నెట్వర్క్పై పకడ్బందీ దర్యాప్తు: పోలీస్ కమీషనర్ వెల్లడినిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ , రవాణా , సరఫరా మరియు విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.,ఆదేశాల మేరకు, నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ పర్యవేక్షణలో , నిజామా బాద్ రూరల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. శ్రీనివాస్ మరియు నిజామాబాదు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో అంతర్రాష్ట్ర ఆల్ప్రాజోలం అక్రమ సరఫరా నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు.అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్ల అరెస్ట్
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్ప్రాజోలం అక్రమ సరఫరాకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లపై Cr.No.127/2025గా NDPS Actలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి , వారిలో నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారి వద్ద నుండి సుమారు 1.087 కిలో గ్రామ్స్ ఆల్ఫోజోలం , దాని విలువ సుమారు రూ.4.50 లక్షలు, Hyundai i20 కారు ( TS 18 H 4755 ) , Maruti Swift Dzire కారు ( TS 08 EG 2753 ) , 5 మొబైల్ ఫోన్లు మరియు రూ.3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.రాజస్థాన్ నుంచి ఆల్ప్రాజోలం అక్రమ రవాణాకేసు దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించగా ఆల్ప్రాజోలం అక్రమ సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వారి విచారణ మరియు ఇతర ఆధారాల ఆధారంగా ఆల్ప్రాజోలం మాదకద్రవ్యాన్ని రాజస్థాన్ రాష్ట్రం నుండి మహారాష్ట్ర మీదుగా అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అక్కడి నుండి చిన్న మొత్తాలలో వివిధ మార్గాల ద్వారా ఆల్ప్రాజోలంను నిజామాబాద్ మరియు నిర్మల్ ప్రాంతాలకు అక్రమంగా తరలించి , స్థానికంగా మాదకద్రవ్యానికి డిమాండ్ ఉన్న వ్యక్తులకు సుమారు కిలోకు రూ.4 లక్షల నుండి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా నిందితులు భారీ మొత్తంలో అక్రమంగా నగదు సంపాదించినట్లు గుర్తించారు. ఆ నగదుతో కార్లు, వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, నివాస గృహాలు కొనుగోలు చేయడంతో పాటు, బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు మరియు డిపాజిట్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.అక్రమంగా సంపాదించిన ఆస్తుల గుర్తింపు, జప్తు డ్రగ్స్ డబ్బుతో కూడగట్టిన రూ: 3.02 కోట్ల ఆస్తులపై జాప్తు చర్యలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు , వారు డ్రగ్స్ అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి , చట్టప్రకారం జప్తు /అటాచ్మెంట్ చర్యలు చేపట్టడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.ఈ క్రమంలో నిజామాబాద్ , నిర్మల్ మరియు మహబూబ్నగర్ జిల్లాల్లోని సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు , తహశీల్దార్ కార్యాలయాలను సంప్రదించి నిందితులు మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థిర , చర ఆస్తుల వివరాలను సేకరించారు.దర్యాప్తులో A1 గంధం శ్రీనివాస్ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు , A2 బొట్ల కాటమయ్య గౌడ్ ఆల్ప్రాజోలం అక్రమ విక్రయాల ద్వారా సంపాదించినట్లు అనుమానిస్తున్న ఆస్తులను గుర్తించారు.