ఏ ఎస్ ఆర్ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూలై 12
ఏ ఎస్ ఆర్ జిల్లా కమిటీ ఎన్నిక అనంతరం రంపచోడవరంలో మొదటిసారి ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత సమావేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టాపూలి శ్రీనివాస్ పడాల్ నేత్రుత్వంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి కంగాల శ్రీనివాస్ అధ్యక్షతన రంపచోడవరం, యు టి ఎఫ్ హౌస్ లో జరిగింది. ఈ సందర్బంగా జిల్లాకమిటీలో ఎన్నికైన అధ్యక్షులు జి. సోంబాబు, అస్సోసియేట్ ప్రెసిడెంట్, కె. మల్లేశ్వరావు, జనరల్ సెక్రెటరీ కంగాల శ్రీను, మహిళా ప్రెసిడెంట్ కనకదుర్గ, వైస్ ప్రెసిడెంట్ కె. లక్ష్మీ వరప్రసాద్, ఆర్గనైజర్లు కుంజాం బాపిరాజు దొర, చిచ్చడి శేషారావ్, సెక్రెటరీ పి. సురేష్ కుమార్, సహాయ కోశాధికారులు పొడియం పండుదొర, జాయింట్ సెక్రెటరీ కారం వెంకటరమణ, ఈగ్జిక్యుటివ్ మెంబెర్ సి. హెచ్ శివకుమార్ మొదలగు బాద్యులకు రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రెటరీ కారం దారయ్య, ఆర్గనైజర్ సోమిలి సింహాచలం ఒప్పొయింట్మెంట్ ఆర్దర్లు అందజేశారు. అనంతరం బాద్యులతో ప్రమాణ స్వీకార చేయించారు. ఈ సందర్బంగా సెంట్రల్ ఆర్గనైజర్ మడివి నెహ్రూ మాట్లాడుతూ ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయస్థాయిలో ఆదివాసి ఐక్యతకు, ఐక్య ఉద్యమాలకు గొప్ప వేదికగా జాతీయ స్థాయిలో నిర్మాణమై మన ముందుకొచ్చింది. అందరం ప్రాంతాలకి, సంఘాలకి, శాఖలకి అతీతంగా ఉమ్మడిగా నిర్మించుకుంటున్న సంఘం. అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్శకులు అందరూ ఈ సంఘంలో సభ్యలుగా, ప్రతినిధులుగా జాయిన్ అయ్యి బలోపేతం చేసి, హక్కుల సాధనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.అలానే ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఏ సి ఎ ఎస్ ఆర్ జిల్లా ఛైర్మెన్ రామారావు దొర మాట్లాడుతూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఐక్యమౌతు జాతిని ఎకం చేయడం, ఐక్య ఉద్యమాలకు అండగా నిలబడడం మొదటి తరం విద్యావంతులుగా, ఉద్యోగులుగా మన భాద్యత. దానికి అనుగుణంగా ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ అడుగులు వేయడం బాద్యులు ముందుకు వెళ్లడం మంచిపరిణామం. హక్కుల సాధనలో ఉద్యోగులు నైతికంగా ఆర్థికంగా హక్కుల ఉద్యమాలకు పూర్తి స్థాయిలో శాశ్వతంగా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ తీర్మానలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్ స్టేట్ చైర్మెన్ కారం రంగారావు, ఎ ఐ ఎ ఇ ఎఫ్ స్టేట్ ఆర్గనైజర్ తుష్టి జోగారావ్, ఏపీఏజెఏసీ వైస్ ప్రెసిడెంట్ తెల్లం శేఖర్ దొర, జోడి నాగేశ్వర్రావు, మట్ల కృష్ణారెడ్డి, బి. మంగాయమ్మ, సారపు నాగేశ్వరావు, కుర్లా ప్రభాకర్ రెడ్డి, ముర్ల ప్రసాద్ రెడ్డి,వీక పొట్టిదొర, చోడి వెంకటేశ్వర్లు, పల్లాల రాజకుమార్ రెడ్డి,బంధం భాస్కర్,తుర్రం శ్రీనివాస్,కన్నయ్య,s. రామకృష్ణ,జగదీశ్వర్,విశ్వనాథ రెడ్డి,గంగరాజు,కిరణ్ కుమార్ రెడ్డి,అర్జున్ దొర, బాపన్న దొర చెల్లన్న దొర, కన్నప్పు దొర,మడకం ప్రసాద్ దొర,కారం రామన్నదొర,రాజేష్ దొర,పండ పవన్ కుమార్ దొర తదితరులు పాల్గొన్నారు.