పయనించే సూర్యడు //ఫిబ్రవరి //14//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్ :సహకార శాఖ ములుగు జిల్లాలో "సీనియర్ ఇన్స్పెక్టర్"గా విధులు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి మాటూరి రాజేష్ ఈనెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు కాకినాడలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కు ఎంపికైనట్టుగా, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..గతంలో వీరు బెంగళూరు,కురుక్షేత్ర, చండీగఢ్, రాంచి,రాయపూర్, భోపాల్, భువనేశ్వర్ లో నిర్వహించిన హాకీ టోర్నమెంట్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలు పొందినారు., మాటూరి రాజేష్ ఎన్నిక పట్ల ములుగు జిల్లా సహకార అధికారి సర్దార్ సింగ్ మాలోత్,సహకార శాఖ సిబ్బంది.,హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాసు, సెక్రటరీ ఉమామహేశ్వర్, తోట రాజేంద్ర ప్రసాద్, గుడ్డెలుగుల సమ్మయ్య, బండ శ్రీనివాస్, చింత శ్రీనివాస్, భూసారపు శంకర్ శ్రీనివాసు, రవికుమార్, యూసుఫ్, సజ్జు బండ రఘు, సురేష్, శ్యామ్, బిక్షపతి, తిరుపతి, కుమారు, సాయి కృష్ణ, ప్రదీప్, రాజేషు, విక్రం, సాంబ, వినయ్, వేణు, స్నేహితులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు..