పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 8 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర పరమేశ్వర ఆధ్వర్యంలో ఆశా డే కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చేది వేసవికాలం కావున తప్పక గ్రామంలో ఆశా కార్యకర్తలు దగ్గర ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఉంచుకొనవలెనని తెలియజేయడం జరిగినది అలాగే గ్రామం నందు వెక్టార్ కంట్రోల్ ఇసుస్ గురించి తప్పక పంచాయతీ కార్యదర్శి కి తెలియజేయవలని తెలపడం జరిగినది అలాగే పరిసరాల పరిశుభ్రత వివరించడం జరిగిన ఈనెల పెద్ద పేట గ్రామంలో మరియు రాయలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల కొట్టాలపల్లి నందు రాత్రిపూట రక్తపూతల ఫైలేరియా వ్యాధి మీద తీయవలెనని జిల్లా మలేరియా అధికారి ఓబులు గారు తెలియజేయడం జరిగినది అలాగే గ్రామంలో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి రక్తపూతలు తీయవలెనని లకు ఎం ఎల్ హెచ్ పి లకు ఆర్ డి టి కిట్టు ద్వారా రక్త పరీక్ష నిర్వహించాలని తెలియజేయడం జరిగినది మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు రెండు చీరలు యూనిఫారం పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ సి.హెచ్.ఓ జుబేదా పీహెచ్ఎన్ వెంకట లక్ష్మమ్మ తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు మేల్ సూపర్వైజర్ రాంప్రసాద్ గౌడ్, ఎల్ డి కంప్యూటర్ సరితా దేవి , ఏఎన్ఎంలు ఎం ఎల్ హెచ్ పి లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.