తాసిల్దార్ కార్యాలయం ధర్నా అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు
పయనించే సూర్యుడు// న్యూస్ //మార్చ్ 18// // రిపోర్టర్ సి తిమ్మప్ప // మక్తల్
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మక్తల్ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రాజ్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు బాలింతలకు పిల్లలకు అనేక సేవలందిస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుటలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ఆశా వర్కులతో ఎట్టి చాకిరీ చేయించుకుంటున్నది. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని వేసిన ఆశల సమస్యలు పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని ఆనాడు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారం లోకి రాకముందు మేం అధికారంలోకొస్తే ఆశల సమస్యలు పరిష్కరించి పిక్స్డి వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఈరోజు హామీ గానే మిగిలిపోయింది. ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఆశలకు కనీస వేతనాలు పెంచాలని పిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఆశలకు హెల్త్ ఇన్సూరెన్స్ 50 లక్షలు కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ!! 5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పరిదోషకాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలి. కర్ని పి హెచ్ సి పరిధిలో ఆశల లెప్రసి 2022 నుండి 2025 పెండింగ్ బిల్లులు చెల్లించాలి. తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో పి హెచ్ సి నాయకురాలు గోవిందమ్మ, అమీనా బేగం, యశోద, ఇందిరా, అనిత, పార్వతమ్మ, వెంకట్ లక్ష్మి, వెంకటమ్మ, సుజాత, పద్మ, లక్ష్మి, రసీదా బేగం 80 మంది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు