
పయనించే సూర్యుడు అక్టోబర్ 31 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ :ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారం పాఠశాలను వైరా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి (ఏటీడీఓ) పి.రమేష్, పూర్వ వైరా ఏటిడిఓ యస్. రాధా గార్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమ్మేటివ్ అసెస్మెంట్ - ఒకటి పరీక్షలను పరిశీలించారు.మధ్యాహ్న భోజన సమయంలో భోజనాలను పరిశీలించి, మెను అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను,స్టోర్ రూమ్ లో నిల్వచేసిన నిత్యవసర సరుకులను, స్టాక్ రికార్డులను, పాఠశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి గిరిజన విద్యాభివృద్ధి కోసం అందరు పాటుపడాలని కోరారు.గత సంవత్సరం నూరు శాతం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు.గత సంవత్సరం మాదిరిగా ఈ విద్యా సంవత్సరంలో కూడా నూరు శాతం ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులను కోరారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు,డిప్యూటీ వార్డెన్ బి.రవి,సీనియర్ ఉపాధ్యాయులు డియస్. నాగేశ్వర రావు,ఉపాధ్యాయులు బి.శోభన్,బి.రవి, వి.రమేష్,ఏ.సుస్మిత,ఎం. చందర్రావు,జె.నాగేశ్వర రావు, డి.ఉషశ్రీ , టి.హర్యానాయక్ ఏ.యన్.యం.సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
