వంటకుక్కు,వాచ్ మెన్,కమాటి పోస్టులు భర్తీ చేయాలి.
విద్యార్థుల పట్ల ఉన్నత స్థాయి అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరించడం సరికాదు.ఏపీ ఆదివాసీ జేఏసీ.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 6.
రంపచోడవరం డివిజన్ పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల ఉన్నత స్థాయి విద్యా అధికారులు బాధ్యతారహితంగా వహరిస్తున్నారని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఆరోపించారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ రంపచోడవరం డివిజన్ పరిధిలో గత సంవత్సరం కాలం నుండి పలు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మరణాలు సంభవించడం జరిగినవని అనారోగ్యానికి గురైనవిద్యార్థులకు వైద్యం అందించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆశ్రమ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయన్నారు. పూర్తిస్థాయిలో ఒక్క ఆశ్రమ పాఠశాలలో కూడా ఉద్యోగులు లేరన్నారు.కొన్ని ఆశ్రమ పాఠశాలను గాలికి వదిలేసారని విద్యార్థులను కలవడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఈ విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించకుండా తూతూ మంత్రంగా సస్పెండ్లు చేస్తున్నారు.తప్ప సమస్యలు పరిష్కరించడం లేదన్నారు.తల్లిదండ్రులు ఏ భరోసాతో తమ పిల్లల్ని చదివించాలని ప్రశ్నించారు.ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలపై జరిగిన ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ప్రతి ఆశ్రమ పాఠశాలలో ఇద్దరేసి ఏ.ఎన్.ఎం పోస్టులను నియమించాలని ఖాళీగా ఉన్న వంట కుక్కు,కమాటీ,వాచ్మెన్లు పోస్టులను భర్తీ చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.