
పయనించే సూర్యుడు న్యూస్, ఆగస్టు 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి బాలాజీ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాసం చివరి శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమార్చనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. వేదమంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తాంబూలాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు.ఆషాడ మాసం చివరి శుక్రవారం అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొనడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల విశేష పాల్గొనికతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది