ఈ ఆచారం ప్రతి ముదిరాజ్ పాటించాలి.
మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 04: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి, రామ్మూర్తి.ఎ.
ములుగు:పుట్టిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు పేరు చివరన ముదిరాజ్ అని నామకరణం చేయాలని ఈ ఆచారాన్ని ప్రతి ముదిరాజ్ పాటించాలని మెపా MEPA ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు. ఇటీవల కాలంలో మెపా ములుగు జిల్లా ఉపాధ్యక్షులు భూమా నరేష్ ,లావణ్య దంపతులకు, ములుగు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెపా ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, అధ్యక్షులు బండి రాజు ముదిరాజ్ ల ద్వారా తెలుసుకున్న మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, ములుగు జిల్లా బాధ్యుల ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ లో భూమా నరేష్ లావణ్య ముదిరాజ్, కుటుంబ సభ్యులను పలకరించి, బాబు ను ఎత్తుకుని పేరు పెట్టి, ఆ పేరు చివరన ముదిరాజ్ అని నామకరణం చేసి, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని దీవించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ,ఇలా పేరు చివరన ముదిరాజ్ అని నామకరణం చేయడం వలన మన బలం, బలగంతో పాటు ఐక్యతకు నాంది అవుతుందని ఈ కార్యక్రమాన్ని ప్రతి ముదిరాజ్ చేపట్టాలని అన్నారు. అనంతరం ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్, అధ్యక్షులు బండి రాజు ముదిరాజ్ లు సంయుక్తంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ములుగు జిల్లా నుండే చేపట్టడం శుభ పరిణామం అని,ములుగు జిల్లాలో ముదిరాజ్ ల ఐక్యతకు కృషి చేస్తామని అన్నారు.అనంతరం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు భూమ నరేష్,లావణ్య దంపతులు మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర, జిల్లా బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, అధ్యక్షులు బండి రాజు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు భూమ నరేష్ ముదిరాజ్, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్, పోలుదాసరి రాము, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దుండి అశోక్ ముదిరాజ్, రాజేందర్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.