ఐటిడిఏ ఏపీఓ కి వినతి.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 13
సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎర్రంపేటలో పాత పోస్ట్ ఆఫీస్ ముందు లైను యందు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తు నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలని అదేవిధంగా చింతూరు సెంటర్లోని అట్టివిశాఖకు సంబంధించిన జూబ్లీ పార్క్ గా పిలవబడే స్థలంలో సుమారు 50 కి పైగా నాన్ ట్రైబల్స్ స్థిర నివాసాలు అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారాలు చేస్తున్నారని, స్థానిక డిఎఫ్ ఓ కి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కావున అటవీ భూముల్లో నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారం చేస్తున్న చర్యలు తీసుకుని ఫారెస్ట్ అధికారులపై, మరియు 1/70 ఉల్లంఘించి బహులంతస్తులు కడుతూ ఉన్న చర్యలు తీసుకొని పంచాయితీ, రెవెన్యూ అధికారు ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ చింతూరు ఐటీడీఏ ఏపీఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మీడియాకు తెలియజేస్తూ 1/70 చట్టం తీవ్ర ఉల్లంఘనకు గురవుతుందని చట్టాలను అమలు చేయాల్సిన చింతూరు రెవెన్యూ, పంచాయతీ అధికారులు ముడుపులు కు అలవాటు పడి బహులంతస్తులు నిర్మిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా చింతూరు కేంద్రంలో ఉన్న అటవీ శాఖకు సంబంధించిన భూమి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గత ఆరు నెలలుగా చింతూరు డిఎఫ్ఓకి మరియు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది మాత్రం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఇదే అక్రమాలు ఆదివాసులు చేసి ఉంటే ఇప్పటివరకు చూస్తూ ఊరుకునేవార? అని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఆదివాసి చట్టాలు నాన్ ట్రైబల్స్ కు చుట్టాలుగా మారుతున్నాయని చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అమ్ముడుపోతున్నారని ఇక ఇలా అయితే ఏజెన్సీలో ఆదివాసి చట్టాలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. చింతూరు ఏజెన్సీలో అటవీశాఖ, ప్రభుత్వ ఆర్ అండ్ బి, పంచాయతీ, రెవెన్యూ,ఇతర ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కట్టిన నాన్ ట్రైబల్స్ పై, చట్టాలు అమలు చేయని అధికారులపై క్రిమినల్ కేసులు వేయాలని అని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏవీఎస్పీ డివిజన్ అధ్యక్షులు కూరా చిట్టిబాబు, కారం సిరామయ్య ఉయిక రత్తయ్య, కారన్ సీతయ్య తదితరులు పాల్గొన్నారు