( పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ వారు గ్రామీణ ప్రగతి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా గత సంవత్సరంలో 21 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికీ ఇంటర్ మొదటి సంవత్సరం నుండి ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి అయేవరకు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల వరకు ఆరు సంవత్సరాలు స్కాలర్షిప్ ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తుంది. అందులో 16 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాసారు, మిగతా విద్యార్థులు పాలిటెక్నిక్ మరియు IIIT కోర్సులు చేస్తున్నారు. ఈ వారంలో వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నూటికి నూరు శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఎక్కువ మంది విద్యార్థులు 90% పైన మార్కులు తెచ్చుకోవడం జరిగింది. ఇందులో ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర టాపర్స్‌గా నిలిచి ప్రతిభను చాటుకున్నారు. కమ్మరి మణి దీపక్ 468/470 మరియు మనుసాని శణ్ముఖ ప్రియా 466/470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఈ విద్యార్థులందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయిలోను రికార్డు సాధించినందుకు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది విద్యార్థులకి, తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులకి అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసారు