పయనించే సూర్యుడు ఆగస్టు 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సార్ ఆదేశాను ప్రకారం డాక్టర్ పరమేశ్వర్ డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఈరోజు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సెక్టార్ మీటింగ్ హాజరై సెక్టార్ మీటింగ్ కి వచ్చిన సూపర్వైజర్లకు ఆరోగ్య కార్యకర్తలకు ఎంఎల్ హెచ్ పి లకు ఇప్పుడు వర్షాకాలం కావున గ్రామంలో జ్వరాలు ఎక్కువగా ఒత్తుకున్నాయి కావున మీరు తప్పక ప్రతిరోజు గ్రామమునందు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని తెలియజేయడం జరిగినది అలాగే జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి రక్త పూతల తీయవలెనని తెలియజేయడం జరిగినది గ్రామంలో తీసిన రక్త పూతలను వారానికి రెండుసార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాడికి పంపవలెనని తెలియజేయడం జరిగింది గ్రామంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే తప్పక తెలియజేయడం జరిగింది అలాగే గ్రామంలోని ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలు పరిశుభ్రత గురించి వివరించవలెనని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు సి హెచ్ ఓ జుబేదా మేల్ సూపర్వైజర్ రాంప్రసాద్ గౌడ్ ఫిమేల్ సూపర్వైజర్ శోభ ఏఎన్ఎంలు ఎం.ఎల్.హెచ్.పీలు పాల్గొన్నారు