పయనించే సూర్యుడు 18 శర్మ స్ వలి మండలరిపోర్టర్ యాడికి
తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు యాడికి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా మలేరియా అధికారి ఆదేశాలు మేరకు తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు డ్రై డే ఫ్రైడే వెరిఫై చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ వార్డు ఇంటిలో గల నీటి తొట్లను పరిశీలించి వార్డులోని ప్రజలకు డ్రై డే ఫ్రైడే గురించి అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం నీటి తొట్లను శుభ్రముగా కడుక్కొని ఒక గంట ఆరబెట్టిన తర్వాత నీటితో తొట్లను నింపుకోవాలన్నారు. అదేవిధంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. అనంతరం చుక్కలూరు ఫ్యాక్టరీ లలో ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే నిర్వహించారు ఈ కార్యక్రమంలో చు క్కలూరు సూపర్వైజర్ ఎంపీ నారాయణ యాడికి రెండవ సచివాలయం ఆశా కార్యకర్తలు సులోచన సుబ్బలక్ష్మి ముస్కిన్ బి సునీత పాల్గొన్నారు