పయనించే సూర్యుడు ఆగస్టు 20 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
మండల పరిధిలోని తహసిల్దార్ 20వ తేదీ బుధవారం తాసిల్దార్ మహబూబ్ చాంద్ అధ్యక్షతన డీలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ అందరు డీలర్లు ప్రతి నెల 26 తేదీ నుండి 30 వరకు 65 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు, దివ్యాంగులకు, మంచానికే పరిమితమై వివిధ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు బియ్యం చక్కెర మొదలగునవి తప్పకుండా పంపిణీ చేయవలెనని తెలియజేశారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్ మాట్లాడుతూ కొందరు డీలర్లు షాపు దగ్గరకు వచ్చిన కార్డుదారులను ఆ గౌరవంగా మాట్లాడుతున్నారని అది మంచి పద్ధతి కాదని వచ్చిన వారితో గౌరవంగా మాట్లాడడం మంచి పద్ధతిని తెలియజేశారు. చాలామంది డీలర్లు బ్లూటూత్ కనెక్ట్ ఉందని ఒకటో తారీఖు నుండి పంపకం చేయవలసిన సరుకులను ముందే పంపకం చేస్తున్నారని అలా చేసిన డీలర్లపై తగిన చర్య తీసుకుంటూ 6 ఏ కేసు బుక్ చేస్తామని తెలియజేశారు. అనంతరం తాసిల్దార్, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి కలిసి సుండుపల్లి షాప్ నెంబర్ 09 ని తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా డీలర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అఫ్జల్ మరియు డీలర్లు పాల్గొన్నారు