
సాక్షి డిజిటల్ న్యూస్ :దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ సత్తా చాటిన హీరోయిన్ టబు. నిన్నే పెళ్లాడతా సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది. మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ అమ్మడు.భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టబు 1971 నవంబర్ 4న జన్మించింది. ఆమె అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. సినీరంగంలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును టబుగా మార్చుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె… ఇప్పటికీ విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. 1994లో హిట్ అయిన విజయపథ్ సినిమాతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. యాక్టింగ్, లుక్స్ అప్పట్లో కుర్రకారు హృదయాలను దొచేశాయి. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది.కూలి నెంబర్ వన్, నిన్నే పెళ్లాడతా, ప్రియురాలు పిలిచింది, ప్రేమదేశం వంటి చిత్రాలతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అలాగే హిందీ, తమిళంలోనూ అనేక చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇప్పటికీ చేతినిండా సినిమాతో హిందీ సినీప్రియులను అలరిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, పద్మ శ్రీ అవార్డ్ అందుకుంది. నివేదికల ప్రకారం టబు ఆస్తులు రూ.22 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.ఆమె సినిమాలు వెబ్ ప్రాజెక్ట్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఆమె ఏటా దాదాపు రూ. 3 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె ఒక్కో చిత్రానికి ఫీజు 2–4 కోట్ల వరకు తీసుకుంటుంది. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.1 కోటి తీసుకుంటుందట. టబు ఎక్కువగా రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెడుతుంది. టబు వద్ద మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, ఆడి క్యూ7, బిఎమ్డబ్ల్యూ ఎక్స్5, బిఎమ్డబ్ల్యూ 7 సిరీస్, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ 220, వింటేజ్ 1965 ఫోర్డ్ ముస్తాంగ్ కార్లు ఉన్నాయి