ఇసుక సరఫరా చేయాలని లబ్ధిదారులు అధికారులకు వినతి
పయనించే సూర్యుడు జులై 3 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా టేకులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న 36 పంచాయితీలలో లబ్దిదారుల ఎంపిక నిర్వహించి పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. అయితే వారి సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ముగ్గులు పోశారు. ఇప్పటికే స్టీలు, సిమెంట్ సేకరించుకోగా, ముఖ్య మెటీరియల్ అయినా ఇసుక సేకరణకు మండలంలో ఉన్న లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, మరియు రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించి, ఇసుక సరఫరాకు ఉన్న అడ్డంకులను తొలగించి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వేడుకుంటున్నారు.