పయనించే సూర్యుడు ఆగస్టు 25, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలో సుమారుగా 521 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఆ లబ్ధిదారుల యొక్క ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ వరకు అయిపోయి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారి ఇళ్ల దగ్గర కు వచ్చి క్యాప్స్ రింగ్ చేసి ఆధార్ చూసి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే డబ్బులు పడటం లేట్ అవుతుందని తక్షణమే ఆధార్ కార్డును తెలంగాణ రాష్ట్రానికి మార్చుకోవాలని ఆమె లబ్ధిదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చింతకాని, నర్సింహాపురం, పందిళ్ళపల్లి ,బొప్పారం, రామకృష్ణాపురం గ్రామాల్లో ఆయా గ్రామ కార్యదర్శులతో కలిసి, పరిశీలించి క్యాప్చరింగ్ చేశారు. ఆమెతోపాటు రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి నల్లగట్ల మురళీకృష్ణ ఉన్నారు.