
ఇందిరమ్మ గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయికల్ శ్రీనివాస్…
*కంసాన్ పల్లిలో సాయిలు నూతన గృహప్రవేశానికి హాజరు *
( పయనించే సూర్యుడు జూన్ 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామానికి చెందిన మాల సాయిలు దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహం గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా రాయికల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసే గొప్ప పథకం ఇందిరమ్మ గృహాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి జరుగుతోందని తెలిపారు.గృహ యజమానీ మాట్లాడుతూ, తమకు ఇందిరమ్మ గృహం మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారి చొరవతో తమ సొంత ఇంటి కల నెరవేరిందని, ఇందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం అందించిన సహకారంతో నేడు తమ కుటుంబం సొంత ఇంటిలో గృహప్రవేశం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మును, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మల్లేష్ కురుమ, ఎడ్ల మహేందర్, తుపాకుల శేఖర్ ముదిరాజ్, నర్సింలు గౌడ్, వార్డు మెంబర్ చెన్నయ్య, చింతకింది సత్యనారాయణ, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు…..