పయనించే సూర్యుడు న్యూస్ // 18 తేదీ మార్చ్ వడ్ల శ్రీనివాస్ ఉగాది వరకు కొనసాగనున్న ఉత్సవాలు. నారాయణపేట జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం, గురుమిట్కల్ నియోజకవర్గ పరిధిలోని ఇడ్లూర్ గ్రామంలో వెలసిన శ్రీ శంకరలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ శంకరలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇడ్లూర్ గ్రామం నుంచి ఆలయం వరకు పల్లకి సేవ ఊరేగింపు. మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండం, సాయంత్రం 5 గంటలకు పవ ఉత్సవం , 19 తేదీన బుధవారం ఉదయం స్వామివారికి గంగస్నానం, పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, మహామంగళహారతి, సాయంత్రం 5:30 గంటలకు స్వామివారి మహా రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.