ఇది నిర్మాణాత్మకమైన బడ్జెట్

- బాపట్ల ఏమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
- పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 1:-రిపోర్టర్ (కే శివకృష్ణ) నిర్మాణాత్మకమైన అభివృద్ధిని కాంక్షించే విధంగా ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందని బాపట్ల సనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ జన రంజకంగా ఉందని కొనియాడారు. ప్రజల ఆలోచనలు,ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో అద్భుతంగా ఆవిష్కృతం అయ్యాయని అన్నారు. అభివృద్ధి,సంక్షేమంతోపాటు హామీల అమలుకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని నరేంద్ర వర్మ పేర్కొన్నారు.అన్నదాతల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమని అన్నారు.తల్లికి వందనం పథకం ద్వారా అమ్మకు అగ్ర తాంబూలం ఇచ్చారని నరేంద్ర వర్మ పేర్కొన్నారు.రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా శజలవనరుల శాఖకు అధిక కేటాయింపులు చేశారని వెల్లడించారు.బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.మత్స్యకారుల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వేట విరామ సమయంలో వారికి అందించే జీవన భృతిని పదివేల నుండి 20 వేల రూపాయలకు పెంచటం సంతోషకరమని నరేంద్ర వర్మ అన్నారు.బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులకు ఈ పథకం ఎంతో అండగా ఉంటుందని పేర్కొన్నారు.అన్ని వర్గాలకు,అన్ని రంగాలకు కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ ద్వారా అనుకూలమైన స్పందన వస్తుందని నరేంద్ర వర్మ చెప్పారు. బాపట్ల జిల్లా కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన హర్షణీయమని అన్నారు.ఉద్యాన పంటలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రూపకల్పన చేసిందని చెప్పారు.సూపర్ సిక్స్ హామీల అమలుకు ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని నరేంద్ర వర్మ అన్నారు.బడ్జెట్ కేటాయింపుల ద్వారా అన్ని వర్గాల్లో కూటమి ప్రభుత్వానికి ఆదరణ లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు చేసే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని నరేంద్ర వర్మ తెలిపారు.ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు,మంత్రులకు బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పేర్కొన్నారు.
https://www.pstelugunews.com