
పయనించే సూర్యుడు జూన్ 19 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ0 పరిధిలో ఇదేనా నెలకు ఒకసారి చేసే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంకి నిదర్శనం ఇదేనా అయ్యా మున్సిపల్ కమిషనర్ తెలుగు పద్యాలలో ఒక పద్యం ఉంది మేడి పండు చూడు మేలమైయుండును పొట్టలిప్పి చూడు పురుగులు ఉండను సూళ్లూరుపేట మున్సిపాలిటీని చూస్తే ఈ పద్యమే గుర్తుకొస్తుంది అయ్యా మీరు పొద్దున్నే లేచి మెయిన్ రోడ్లను మాత్రమే క్లీన్ చేస్తున్నారా లేదా చూస్తున్నారే తప్ప మెయిన్ రోడ్లకి అనుసంధానమైన రోడ్లని వెళ్లి చూడట్లేదు కనుకనే సందుల్లో ఉండే రోడ్లు ఇలాంటి దుస్థితిలో ఉన్నాయి కెప్టెన్ బాగుంటేనే కాదు కెప్టెన్ కింద ఉండే ఆటాడే వాళ్ళు కూడా బాగానే ఉండాలి కానీ మీరు ఉన్నప్పుడు నటించి మీరు వెళ్ళిన తర్వాత మందేం పోయిందిలే అనుకొనే విధంగా ఉన్నారు మీ మున్సిపాలిటీ కార్మికులు ఒకసారి తాజ్ పెట్రోల్ బంకు పక్క సందులో వెళ్లి చూస్తే మీకే అర్థమవుతుంది సూళ్లూరుపేటలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ఎలా నడుస్తుందో మనం చేసే మున్సిపాలిటీ పని చైన్ లింక్ ప్రాసెస్ లాంటిది పైనుంచి కింద వరకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా వన్ బై వన్ పనిచేస్తే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కనిపిస్తుంది ప్రతి ఒక్క మున్సిపాలిటీ కార్మికుల మనసులో ఏముందంటే పదిమంది చేయాల్సిన పనిని ఐదుగురు చేత చేపిస్తున్నారు అనే భావం బలంగా నాటుకు పోయింది కనుకనే పైపైన పని చేసి వెళ్ళిపోతున్నారు ఈ పని మనది మనం తీసుకున్న జీతానికి కష్టపడి పని చెయ్యాలి అనే భావం మున్సిపాలిటీ కార్మికులలో కలగాలి అప్పుడే సూళ్లూరుపేటకి నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర వస్తుందని సూళ్లూరుపేట ప్రజలు అనుకుంటున్నారు